ఎం.వెంకటాయపాలెం సమీపంలో పెద్దపులి సంచారం?

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఎం.వెంకటాయపాలెం సమీపంలో పెద్దపులి ( Khammam Tiger Panic ) తిరుగుతుందనే ప్రచారం స్థానిక ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామం సమీపంలోని కంకర మిల్లు వద్ద పెద్దపులి సంచరించిందని, ఆ మిల్లు కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.

​కార్మికుల కథనం ప్రకారం:

​కంకర మిల్లు వద్ద గుర్తుతెలియని పెద్ద జంతువు సంచరించడాన్ని కార్మికులు గమనించారు. ఆ జంతువు కాలువ దాటి సమీపంలోని గుట్టల్లోకి వెళ్లినట్లు వారు చెబుతున్నారు. ఈ వార్త ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాలకు, పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.

కాగా, ​మూడేళ్ల క్రితం కూడా సరిగ్గా ఇదే ప్రాంతంలో ఇలాంటి పులి సంచార వార్తలే కలకలం రేపాయి. అయితే అప్పట్లో అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అది పెద్దపులి కాదని “అడవి పిల్లి” అని నిర్ధారించారు. గతంలో జరిగిన సంఘటనను గుర్తుచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం కార్మికులు చెబుతున్న వివరాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఈ వార్తపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని… కాలిబాటలు లేదా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఏ జంతువు సంచరిస్తోందో తేల్చి ప్రజల భయాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>