రైతును అవమానించిన గజ్వేల్ తహసీల్దార్‌పై వేటు

కలం, వెబ్ డెస్క్ : సొంత భూమి సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయానికి వచ్చిన ఒక రైతును అవమానించిన ఘటనలో గజ్వేల్ తహసీల్దార్ (Gajwel Tahsildar) చిట్టంపల్లి స్వామిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

సదరు రైతు తన భూమి వివాదంపై మాట్లాడేందుకు వెళ్లగా, “నువ్వింకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?” అంటూ తహసీల్దార్ స్వామి వ్యాఖ్యానించినట్లు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అధికారి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవ్వడం, వివాదం పెద్దది కావడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆర్డీవో ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ స్పందిస్తూ తహసీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>