కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలిక అరులియా కిడ్నాప్ (Secunderabad Kidnap) వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. రెండు రోజులుగా పాప ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగిన సెక్యూరిటీ గార్డు విక్రమ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. బాలికను దారుణంగా హత్య చేసిన విక్రమ్, మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌కు చెందిన క్లబ్ హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో పడేసి పరారయ్యాడు.
ఘటన తర్వాత నిందితుడు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని మొబైల్ సిగ్నల్ ఆధారంగా ప్రస్తుతం విక్రమ్ సికింద్రాబాద్‌లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాప వెనుకాలే విక్రమ్ వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు తీవ్రతరం చేశారు.

