అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

కలం, హనుమకొండ: వరంగల్‌ (Warangal) నగరంలో బతుకమ్మ (Bathukamma) సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయం (Thousand Pillar Temple) మహిళలతో కిక్కిరిసింది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

దీపకాంతులు, విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆలయ ప్రాంగణం బతుకమ్మల రంగులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ సందడితో కళకళలాడాయి. వరంగల్‌లో ఎమ్మెల్యే కొండా సురేఖ బతుకమ్మను ఎత్తుకుని వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళల ఆటపాటలు, పూల బతుకమ్మల అందాలతో నగరంలో హ‌డావుడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>