కరెంట్, నీటి సంక్షోభం.. సీఎం రేవంత్ హెచ్చరిక

కలం,‌ వెబ్ డెస్క్: ఎల్ నినో (El Nino) కారణంగా రాష్ట్రంలో నీటి సంక్షోభం ముప్పు పొంచి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు ప్రతి చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రాబోయే ముప్పును ముందే గ్రహించి.. ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్తు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. మార్కెట్‌లో విద్యుత్తు లభించడం లేదని సీఎం రేవంత్ (Revanth Reddy) పేర్కొన్నారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరారు. విద్యుత్తు ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. కొవిడ్ సంక్షోభం మాదిరే ఎల్ నినో ముప్పును ఎదుర్కోవాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Also Read : అడవిలో అద్భుతం.. మంచిర్యాలలో దేశంలోనే తొలి అడ్వెంచర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>