కలం, అశ్వారావుపేట: అశ్వారావుపేట (Aswaraopeta) నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు, క్రీడల ప్రోత్సాహమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్ నియోజకవర్గ సమగ్ర పురోగతి కోసం శ్రమిస్తున్నారు. పట్టణ శోభను పెంచేందుకు తాజాగా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. దీంతో ప్రధాన రహదారులు కాంతులీనుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రతతోపాటు పట్టణ అందాలు మరింత ద్విగుణీకృతమయ్యాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు యువతలోని క్రీడా పటిమను వెలికితీసేందుకు అశ్వారావుపేటను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వేదికగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రాధాన్యం ఇస్తూ, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అలాగే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్రీడలు, మరోవైపు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

