కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన 110 విదేశీ మద్యం బాటిళ్లను అబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశాలతో జిల్లా ఎక్సైజ్ ఎస్హెచ్వో సరిత ఆధ్వర్యంలో అధికారులు న్యాల్కల్ రోడ్డు, ముబారక్ నగర్లోని కంఠాల గంగారత్నం, మూడ భాస్కర్ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర మార్గాల ద్వారా మద్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఇక్కడ అవసరమైన వ్యక్తులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. బాటిళ్లను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు గజేందర్, హుస్సేన్, ఎస్సై రవి, సిబ్బంది పాల్గొన్నారు.

