కలం, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్రలో ఎంతో ఫేమస్ అయిన బుర్ర కథ నేపథ్యంలో, బుర్ర కథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవితం ఆధారంగా తెలుగులో ఒక సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. తెలుగు హీరోయిన్ కాయల్ ఆనంది ప్రధాన పాత్రలో నటించారు. బుర్ర కథ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సినిమాపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) స్పందించారు. ఈ సినిమా కోసం సాధారణ ఆడియెన్స్‌లాగే తాను కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ముందుగా గరివిడి లక్ష్మి సినిమా గురించి సోషల్ మీడియాలో చూశాకే తెలిసినట్లు లోకేశ్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు. సినిమా పాటలు , టీజర్ తనలో ఆసక్తి కలిగించాయన్నారు. దీంతో గరివిడి లక్ష్మి ఎవరు? అని ఆరా తీసినట్లు పేర్కొన్నారు.
అప్పుడే ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకొని, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన విజయలక్ష్మి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిసిందన్నారు. చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చారని గరివిడి లక్ష్మిని కొనియాడారు. ఈ సినిమా కోసం పని చేసిన ఆర్టీస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు ఇప్పటికే ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్, రాశి, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 17న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

