కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు మిస్ కావొద్దని సీఎం చంద్రబాబు (Chandrababu) మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన అత్యవసర కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 15వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున విడుదల చేయబోతున్నామని.. సోమవారం, మంగళవారం నాటికి నిధులు ఎమ్మెల్యేలకు అందుతాయని వివరించారు. మంత్రులంతా వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ, జనసేన నేతలు పూర్తి సమన్వయంతోనే పనిచేయాలన్నారు.
బీసీ రిజర్వేషన్లపై జగన్ తప్పులు..
బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ (YS Jagan) తప్పు చేశారని సీఎం చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఎలాంటి కమిషన్ లేకుండానే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చారని.. జీవోను హై కోర్టు కొట్టేసిందన్నారు. అప్పుడైనా సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లలేదని విమర్శించారు. ప్రతి జిల్లాలో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదే అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో 35 శాతం, కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 6 శాతం బీసీలకు కేటాయించినట్లు వివరించారు.
Also Read : ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆరా తీసిన నారా లోకేశ్..!
Follow Us On: Youtube

