కలం, వెబ్‌డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభిజీత్ నానమ్మ సావిత్రిబాయి శంకరారావు దీప్కే శనివారం ఉదయం మృతి చెందారు. మహారాష్ట్రలోని హింగోలిలో నివాసం ఉంటున్న సావిత్రిబాయి వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతు మృతి చెందారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా పోలీసులే అభిజిత్‌కు నానమ్మ మృతి చెందిన విషయాన్ని తెలిపారు. అయితే అభిజిత్ పోలీసుల అదుపులోనే ఉంటారా? లేక తన సొంత ఊరికి వెళ్లి నానమ్మ అంత్యక్రియలకు హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉంది.
సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీఈఐ రాజీనామా కోరుతూ సీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అభిజిత్ దీప్కే(Abhijeet Dipke)తో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ తదితర నేతలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణ కారణాల రీత్యా ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే తాము తమ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది.
Also Read : కాఫీ షాప్‌లో సీఎం విజయ్, రాహుల్ సందడి!
Follow Us On : WhatsApp

