అమెరికా నుంచి వీడియో కాల్‌.. లైవ్‌లో పిండ ప్ర‌దానం!

క‌లం, వెబ్‌డెస్క్‌: అన్నీ ఆన్‌లైన్‌లోనే.. అనే డైలాగ్‌కు కొంద‌రు జ‌నం సంపూర్ణంగా న్యాయం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంగేజ్‌మెంట్‌లు, పెళ్లిళ్లు కూడా ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌డం చూశాం. తాజాగా ఏపీలో ఆన్‌లైన్‌లో పిండ ప్ర‌దానం (Pinda Pradanam) చేసిన వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంలో ఓ వ్య‌క్తి వీడియో కాల్ ద్వారా పిండ ప్ర‌దానం చేశాడు. వెంప గ్రామానికి చెందిన సూర్య నారాయ‌ణ ఎన్నో ఏళ్ల క్రితం కుటుంబంతో స‌హా అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. ఏటా హిందూ సాంప్ర‌దాయాల ప్ర‌కారం మ‌హాల‌య అమావాస్య‌ (Mahalaya Amavasya) కు పితృదేవ‌త‌కు పిండ ప్ర‌దానం చేసే విషయం అంద‌రికీ తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా సొంతూరికి వ‌చ్చే స‌మ‌యం లేక సూర్య నారాయ‌ణ ఆన్‌లైన్‌లో పిండ ప్ర‌దానం చేసేందుకు నిర్ణ‌యించారు. దీని కోసం భీమ‌వ‌రంలో ఉండే కొంద‌రు పూజారుల‌తో మాట్లాడారు. అమెరికా నుంచి పూజారుల‌కు వీడియో కాల్ చేశారు. పూజారులు ఇక్క‌డ పిండ ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రిపించ‌గా సూర్య నారాయ‌ణ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీడియో కాల్‌లో వీక్షించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలోకి కూడా వ‌చ్చేసింది.

Also Read : ఒక్క సీటు మిస్ కావొద్దు: సీఎం చంద్రబాబు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>