చిరంజీవికి జాతీయ అవార్డు రాకుండా చేశారా..? కారణమిదే!

కలం, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరు చెప్పగానే ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా, ఎన్నో విభిన్న సినిమాల్లో సైతం నటించి మెప్పించారు. ఆయన ఖతాల్లో స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి క్లాసిక్ మూవీస్ ఉన్నాయి. అయితే చిరు నటనకు మంచి మార్కులు పడ్డా.. పలు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకోలేకపోయారు. ఇదే విషయమై ప్రముఖ నిర్మాత కొడుకు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు ఏడిద శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపద్బాంధవుడు(Aapadbandhavudu)’ సినిమాకు చిరంజీవికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దాదాపు ఖాయమైందని, చివరి నిమిషంలో మిస్ అయ్యిందని ఆయన ఆరోపించారు. దక్షిణాది పరిశ్రమకు చెందిన కొందరి రాజకీయాల వల్లే మెగాస్టార్‌కు అవార్డు దక్కలేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్‌లో చర్చనీయాంశమవుతోంది.

Also Read : ఎరుపు VS తెలుపు డ్రాగన్ ఫ్రూట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>