కలం, వెబ్ డెస్క్ : మహాత్మా గాంధీ మునిమనుమడు, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ (Tushar Gandhi)ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar)ను తొలగించాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో జరుగుతున్న నిరసనకు మద్దతుగా ముంబైలో ఈ ఆందోళన చేపట్టారు. నేషనల్ కాలేజ్ వద్ద తుషార్ గాంధీని అదుపులోకి తీసుకుని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఫిరోజ్ మిథిబోర్వాలాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ తమ నిరసన ఆగదని తుషార్ గాంధీ (Tushar Gandhi) స్పష్టం చేశారు. జాతీయ జెండా, రాజ్యాంగ ప్రతితో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలోని చారిత్రాత్మక ఆగస్టు క్రాంతి మైదాన్‌కు ప్రతి ఒక్కరూ చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులకు కల్పిస్తోందని ఆయన గుర్తుచేశారు.
Also Read : రష్యాతో డీజిల్ డీల్: ట్రంప్ సంచలన నిర్ణయం!
Follow Us On : WhatsApp

