కన్నులపండువగా పాగుంట స్వామివారి కల్యాణ మహోత్సవం!

కలం, ‌జోగులాంబ గద్వాల: మహాలయ అమావాస్య సందర్భంగా కేటిదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (Pagunta Temple) వారి దర్శనానికి శనివారం భక్తులు తాకిడి పెరిగింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అఖండ భజనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కన్నుల పండువగా స్వామి వారి కళ్యాణోత్సవం

అమవాస్య సందర్భంగా పాగుంట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ప్రాతఃకాల పూజలు, అభిషేకం, దీక్షా హోమం, శాంతిహోమం, పూర్ణాహుతి, చక్ర స్నానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అలివేల మంగ సమేత లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మహా మంగళ హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>