ఢిల్లీ విమానాశ్రయంలో సీజేపీ నేతల అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు విమానంలో ఢిల్లీ చేరుకున్న CJP ప్రముఖ నేతలు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను పోలీసులు విమానం ల్యాండ్ అయిన వెంటనే లోపలికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు (CJP Leaders Arrest).

ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ముందస్తు అనుమతులు లేవని స్పష్టం చేసిన ఢిల్లీ పోలీసులు, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నగరవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు. విమానాశ్రయం నుంచే నేతలను అదుపులోకి తీసుకోవడంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసుల చర్యపై ప్రతిపక్ష నేతలు పలు ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ధర్నా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. నిరసనలో పాల్గొనేందుకు రోడ్లపైకి వస్తున్న CJP మద్దతుదారులను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు.

నిరసన ప్రదర్శనకు అనుమతులు లేవని, ఎవరూ జంతర్ మంతర్ వైపు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట భద్రత నిఘా ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>