డ్రై ఫ్రూట్స్‌లో పురుగులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్‌లో ఉన్న ఒక డ్రై ఫ్రూట్స్ షాపులో నాణ్యత లేని, పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. ఇలాంటి ఆహార పదార్థాల విక్రయాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం సదరు షాపులో డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా పురుగులు ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. దీంతో షాపు యజమానిని నిలదీయగా, తన తప్పును అంగీకరించకుండా, కొనుగోలు చేసిన వస్తువులను తిరిగి తీసుకునేది లేదని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పినట్లు ఆరోపించారు.

అనంతరం ఇతర కస్టమర్లు కూడా డ్రై ఫ్రూట్స్‌ను పరిశీలించగా, వాటిలో పురుగులు ఉన్నట్లు గుర్తించారని బాధితుడు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించడం సరికాదని ఆయన అన్నారు. సంబంధిత ఆహార భద్రతా అధికారులు సదరు షాపులో విక్రయిస్తున్న డ్రై ఫ్రూట్స్ నాణ్యతను తనిఖీ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>