తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ: జగదీష్ రెడ్డి

కలం, సూర్యాపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి బతుకమ్మ (Bathukamma) ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలతో పాటు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ప్రకృతిని పరమేశ్వరిగా భావించి రంగురంగుల పూలతో పూజించడం ప్రత్యేకత అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బతుకమ్మ పండుగ గ్రామగ్రామాన ప్రజల్లో ఉత్సాహాన్ని నింపిందని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. నేడు బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి, ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించేలా చర్యలు చేపట్టారని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రుల వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>