కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు మరోసారి ఢిల్లీలో ధర్నాకు దిగారు. ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణు గోపాల్, మహువా మొయిత్రా, గౌరవ్ గొగొయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తదితరులు రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియతో ఓట్లు డిలేట్ చేయిస్తున్నారని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. నేతల మెరుపు ధర్నాతో విజయ్ చౌక్ ప్రాంతంలో ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయి.. ఆందోళనను విరమించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు.

