గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి!

కలం, ఖమ్మం బ్యూరో: గ్రామపంచాయతీల్లో నిరంతరం సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26 వేలు అమలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సీఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన ఏఐటీయూసీ అనుబంధ గ్రామచపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్నా జీపీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న మల్టీపర్పస్ విధానానికి చెందిన జీవో 51 రద్దుకై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతానని స్పష్టం చేశారు. జీవో నంబర్ 60 ప్రకారం వేతనాల అమలుతోపాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ భరోసా, యూనిఫాంలు, శానిటైజర్ కిట్లు అందించేలా సంబంధిత మంత్రి, అధికారులతో చర్చిస్తానన్నారు.

అలాగే సొంత ఇల్లు లేని అర్హులైన పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక కోటా కేటాయించేలా చూస్తానని భరోసానిచ్చారు. కార్మికుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, ఎస్.కే. సాబిర్ పాషా పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>