సుకుమార్‌తో మహేశ్ మూవీ?.. స్టోరీ రెడీ

కలం, సినిమా: రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ మూవీ చేస్తున్న మహేశ్ బాబు (Mahesh Babu) ఆ తరువాత చేయబోయే ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న వారణాసి తరువాత మహేశ్ స్టార్ డమ్ మరింత పెరిగే అవకాశం ఉందని లెక్కలేసుకుంటున్నారు. అందుకే తరువాత చేయబోయే ప్రాజెక్టు కూడా ఆ స్థాయిలోనే ఉండేలా మహేశ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో మూవీ చేయబోతున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ మూవీ డిజాస్టర్ అయినా.. విమర్శకుల ప్రశంసలు పొందింది. మహేశ్ కూడా సుకుమార్ టేకింగ్ అద్భుతమని ప్రశంసించాడు. పుష్ప మూవీ తరువాత సుకుమార్ రేంజ్ కూడా పెరిగింది. ఇప్పుడు మరోసారి ఇద్దరు జత కట్టబోతున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2027లోనే ప్రారంభం..?

సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో మూవీ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ జరగబోతుందని టాక్. ఇదే సమయంలో మహేశ్‌తో మూవీ ఓకే అయితే.. 2027 చివరి నాటికే మొదలవుతుందని చెబుతున్నారు. అప్పటివరకు మహేశ్ వెయిట్ చేస్తారా.. లేకపోతే మరో దర్శకుడికి అవకాశం ఇస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మహేశ్ బాబుకి పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు కూడా స్టోరీలు వినిపించినట్లు సమాచారం. వారణాసి మూవీ 2027 ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే మహేశ్ బాబు షూట్ కూడా పూర్తయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>