కలం, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ కొత్త సీజన్లో బలమైన ఆరంభంపై ఎఫ్‌సీ గోవా (FC Goa) కన్నేసింది. శనివారం చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగే తొలి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ప్రత్యర్థి కంటే ఆటపై ఎక్కువ నియంత్రణ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని కోచ్ గౌరమాంగి సింగ్ మోయిరాంగ్థెమ్ స్పష్టం చేశారు. జట్టు ఆటతీరులో మార్పు ఉండదని కోచ్ తెలిపారు. సీజన్ మొత్తం పోటీతత్వంతో ఆడుతూ, విజయావకాశాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
అయితే, చెన్నైయిన్ ఎఫ్‌సీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని ఆయన అంచనా వేశారు. ఆరంభం నుంచే సరైన మానసిక స్థితితో, పూర్తి ఏకాగ్రతతో ఆడాలని ఆటగాళ్లకు సూచించారు. జట్టు డిఫెండర్ సందేశ్ ఝింగన్ కూడా సమష్టి ఆట ప్రాముఖ్యతను వివరించారు. కోచ్ వ్యూహాలు, ఆటగాళ్ల సమన్వయం కలిసినప్పుడే విజయావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. శనివారం జరిగే ఈ పోటీలో ఎఫ్‌సీ గోవా తనదైన ఆటతీరుతో సీజన్‌ను ప్రారంభించాలని చూస్తోంది.

