కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు(Internet Shutdown) సంబంధించిన ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆంక్షలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు, ఢిల్లీలో CJP నిర్వహించ తలపెట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిర్వహించిన నిరసన సందర్భంగా చట్టబద్ధమైన ఆదేశాలు, ఇచ్చిన హామీలను పాటించలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరసనలకు అనుమతులు పొందే విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read : ‘చరిత్ర తెలుసుకోండి’.. అమెరికాకు భారత్ కౌంటర్!
Follow Us On : WhatsApp

