కలం, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీని (Virat Kohli) కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ స్థానంలో తనను నియమించాలని ఆర్‌సీబీ (RCB) భావించిందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) వెల్లడించాడు. 2019 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఈ ప్రతిపాదన తన ముందుకు వచ్చిందని తెలిపాడు. అయితే, కోచ్‌ల మార్పుతో ఆ ప్లాన్ ముందుకు సాగలేదని వివరించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్‌సీబీతోనే కొనసాగుతున్నాడు. 2013 నుంచి 2021 వరకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, 2019 సీజన్‌కు ముందు అతడి స్థానంలో పార్థివ్‌ను కెప్టెన్ చేయాలనే ఆలోచన వచ్చిందని తాజాగా చర్చ మొదలైంది.
ఆర్‌సీబీ మాజీ ఆటగాడు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కోహ్లీ స్థానంలో పార్థివ్(Parthiv Patel)ను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని అప్పట్లో చర్చ జరిగిందని వెల్లడించాడు. పార్థివ్‌కు క్రికెట్‌పై మంచి అవగాహన ఉందని, నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని తీవ్రంగా పరిశీలించారని తెలిపాడు. తాజాగా ఆకాశ్ చోప్రా(Aakash Chopra)తో యూట్యూబ్ చర్చలో పార్థివ్ ఈ విషయంపై స్పందించాడు. తనకు కెప్టెన్సీ ఇచ్చే అంశాన్ని అప్పట్లో ఆషిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్ ప్రస్తావించారని చెప్పాడు.
వచ్చే ఏడాదికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు వెల్లడించాడు. కానీ, ఆ తర్వాతి సీజన్‌కు ముందే ఆ ఇద్దరూ జట్టు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొత్త కోచ్‌లు రావడంతో పరిస్థితులు మారిపోయాయని పార్థివ్ తెలిపాడు. ఆ సీజన్‌లో తనకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదని వివరించాడు. అయితే, కోహ్లీ 2019లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కొనసాగాడు. 2021 సీజన్ తర్వాత పనిభారాన్ని నిర్వహించుకునేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. పార్థివ్‌కు కెప్టెన్సీ అప్పగించాలనే ఆలోచన ఆచరణలోకి రాకపోవడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
Also Read : కోహ్లీని తప్పించాలనుకున్న ఆర్‌సీబీ!
Follow Us On: Sharechat

