కలం, వెబ్ డెస్క్: బీజేపీ వ్యతిరేక ఓట్లను కావాలనే కేంద్రం తొలగిస్తోందని బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravi Chandra) ఆరోపించారు. స్వంతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఒక పార్టీకి ఊడిగం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) తక్షణమే తప్పుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.14 సార్లు సీఈసీ నిర్ణయాలతో సహా కమిషనర్లు విభేదించారని అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో సర్ పేరిట 95 లక్షల ఓట్లు తొలగించారని మండిపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధంగా మారిపోయిందని వద్దిరాజు (Vaddiraju Ravi Chandra) ఫైర్ అయ్యారు. సీఈసీ ఓ ప్రైవేటు సంస్ధను పెట్టుకుని ఓట్లను విచ్చలవిడిగా తొలగించారని అన్నారు. ఓకే వ్యక్తికి దేశంలో ఒకే ఓటు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ సీఈసీని కోరినా ఆ సాఫ్ట్ వేర్ లేదని సమాధానమిచ్చారని చెప్పుకొచ్చారు. దీని బట్టే సీఈసీ పనితీరు ఎంత పేలవమో తెలుస్తోందని విమర్శించారు. తొలగించిన ఓటర్లు తర్వాత అర్హతలు చూపించినా తిరిగి జాబితాలో ఎందుకు చేర్చుకోవడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.
రోగికి డాక్టరే విషమిచ్చి చంపినట్టు సీఈసీ దేశ పౌరులను ఓట్లకు దూరం చేశారని ఆరోపించారు. దేశ జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు. సీఈసీ తొలగించిన ఓటర్లపై స్వంతత్ర విచారణ చేపట్టాలని.. స్థానిక అధికారుల పాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారం 7 పేరిట చేస్తున్న దరఖాస్తులపై విచారణ జరగాలని చెప్పారు.
Also Read : వంట చేసిన కేటీఆర్.. ఎవరి కోసమంటే?
Follow Us On: Instagram

