తెలుగబ్బాయితో పెళ్లి.. హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్ ఇదే!

కలం, సినిమా: ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు హీరోయిన్స్ తెలుగు హీరోలు, ప్రముఖులను పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయినవారుఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తనకు తెలుగు రాష్ట్రాలతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. హైదరాబాద్‌లోనే పుట్టానని, బై బర్త్ తాను తెలుగమ్మాయినే అని ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో చెప్పారు.

ఇక తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటారా..? అని ఓ రిపోర్టర్ అడగగా.. “అది తెలియదు.. మే బీ చేసుకోవచ్చు” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. హీరోయిన్స్ రష్మిక, లావణ్య త్రిపాఠి మాదిరిగా నిధి కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చేమోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  నిధి అగర్వాల్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు ప్రైవేట్ ఈవెంట్లలో సందడి చేస్తూ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>