కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmoor Venkat) సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఒక డ్రగ్గిస్ట్ అని, ఆయనకు తరచూ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెంకట్ మాట్లాడారు. కేటీఆర్‌పై పదేపదే డ్రగ్ సంబధిత ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్నారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ల వెంట్రుకలను పరీక్షించినా దొరికిపోతారని చెప్పారు. వెంట్రుకల కింద ఉండే లోపలి లేయర్‌లో ఉన్న శాఫ్ట్ అనే పార్టికల్‌ను టెస్ట్ చేస్తారన్నారు. డ్రగ్ తీసుకున్నా దొరక్కూడదని కేటీఆర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (Hair Transplantation) చేయించుకున్నారని చెప్పారు.
తరచూ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి తన హెయిర్‌కు బ్లీచ్ చేస్తే శాఫ్ట్ నశించిపోతుందన్నారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లు కావాలనే ఇలా వెంట్రులకు బ్లీచ్ వేస్తూ తరచూ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటారన్నారు. అలాగే కేటీఆర్ లండన్ నుంచి వచ్చిన ఒక డాక్టర్ వద్ద హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని వెంకట్ (Balmoor Venkat) ఆరోపించారు. రూ.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజు ఫామ్‌హౌస్‌లో సీక్రెట్‌గా ఈ ట్రీట్‌మెంట్ చేయించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయనకు ముఖం వాచిందని, అందుకే బయటకు రాకుండా ఆరోగ్యం బాగా లేదని ట్వీట్ పెట్టారని అన్నారు. సాధారణ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయితే కేటీఆర్ ఎందుకు బయట చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు.
Also Read : కేంద్ర సంచలన సర్వే.. తెలంగాణలో భారీగా చెరువులు గాయబ్!
Follow Us On: Instagram

