కలం, వెబ్ డెస్క్ : శాంతి, అంతర్జాతీయ న్యాయ సూత్రాల రక్షణకు విశేష కృషి చేసిన ప్రసిద్ధ న్యాయ కోవిదురాలు నవనీతం “నవీ” పిళ్ళై (Navi Pillay) 2026 నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)కి ఎంపికయ్యారు. మానవ హక్కుల పరిరక్షణలో ఆమె అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది.
నవీ పిళ్ళై (Navi Pillay) అసలు పేరు నవనీతం నాయుడు. ఆమె సెప్టెంబర్ 23, 1941న దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జన్మించారు. ఆమె భారతీయ తమిళ మూలాలు ఉన్న కుటుంబానికి చెందినవారు. ఉపాధి కోసం తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లి చెరకు తోటల్లో కార్మికులుగా పనిచేసిన కుటుంబంలో జన్మించిన ఆమె, అనేక ఆటంకాలను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానానికి ఎదిగారు. న్యాయవాది పరంజోతి ఆంథోనీ పిళ్ళై (గాబీ పిళ్ళై) ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె తన పేరును నవీ పిళ్ళైగా మార్చుకున్నారు.
తమిళనాడు సాంప్రదాయ కుటుంబాలలో కనిపించే ‘పిళ్ళై’ అనే ఇంటిపేరు, దక్షిణాఫ్రికాలో ‘పిళ్ళై’ గా స్థిరపడింది. ప్రపంచ మానవ హక్కుల రక్షణలో నవీ పిళ్ళై పాత్ర అత్యంత కీలకమైనది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా (2008-2014) ఆమె విశేష సేవలు అందించారు. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా, రువాండా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు, బాధితులకు న్యాయం చేకూర్చడానికి కృషి చేశారు. దక్షిణాఫ్రికా పౌరసత్వం కలిగిన ఆమె సాధించిన ఈ విజయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : వంట చేసిన కేటీఆర్.. ఎవరి కోసమంటే?
Follow Us On: Youtube

