మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కమిషనర్

కలం, హనుమకొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు సహా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ టి. వెంకన్న తెలిపారు.

శుక్రవారం హనుమకొండ (Hanumakonda) నగర పరిధిలోని హసన్‌పర్తి, భీమారం చెరువులను కమిషనర్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, పండుగ అనంతరం చెరువుల పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు.

సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఆడపడుచుల ఆనందమే బతుకమ్మ పండుగకు అసలైన శోభని, నగరంలో పండుగ వాతావరణం వెల్లివిరిసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్‌తో పాటు ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : హరీశ్ రావు పరువు నష్టం కేసు.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>