భూములపై హక్కు మీది.. రక్షణ బాధ్యత మాది: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ పరిధిలోని నరసింగోలు గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు.

రైతులు తమ పంట పొలాల్లో వ్యవసాయం చేయడంపైనే దృష్టి సారించాలి తప్ప, భూమి భద్రత గురించి లేదా ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అర్జీలు పట్టుకుని తిరగాల్సిన అవసరం రాకూడదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భూమిపై హక్కు వారికే ఉండేలా చూస్తామని, ప్రజల భూములకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. సాంకేతికతను వినియోగించుకుంటూ భూ వివాదాలు లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.

Also Read : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>