కలం, వెబ్ డెస్క్: న్యూఢిల్లీ వెళ్లే రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే శాఖ కీలక సమాచారం వెల్లడించింది. అక్టోబర్ 10న ట్రాఫిక్ రద్దీ కారణంగా ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాల్సిన పలు మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు (Express Trains Cancellation) చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
ఈ సమయంలో ప్రయాణించాల్సిన రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు తమ రైళ్ల రాకపోకల వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. రైళ్ల రద్దు కారణంగా ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే, ఏయే రైళ్లు రద్దయ్యాయి, వాటి నంబర్లు ఏమిటి అనే పూర్తి వివరాలను రైల్వే శాఖ అధికారిక ప్రకటన ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది.
నిరసనలతో సంబంధం ఉందా?
మరోవైపు, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు రైళ్ల రద్దు (Express Trains Cancellation) నిర్ణయంతో సంబంధం ఉండవచ్చంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారంపై రైల్వే అధికారులు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు. ప్రస్తుతం రైళ్ల రద్దుకు ట్రాఫిక్ రద్దీనే కారణంగా ప్రకటించారు.
Also Read : ఢిల్లీలో హైఅలర్ట్: రంగంలోకి 7వేల సీఆర్పీఎఫ్ బలగాలు!
Follow Us On: Youtube

