చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నవలా రచయిత ఆచార్య ముదిగొండ శివప్రసాద్ (86) గురువారం రాత్రి 8:45 నిమిషాలకు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరు ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా ప్రసిద్ధులయ్యారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా ఆకులల్లూరు. వీరి తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, మల్లికార్జున రావు. శివ ప్రసాద్ దాదాపుగా 83 పుస్తకాలు రాస్తే, అందులో 20 చారిత్రక నవలలే.  వీరికి రాష్ట్ర, దేశ రాజకీయాలపై విపరీతమైన పట్టు వుంది.

ముదిగొండ శివప్రసాద్ (Mudigonda Sivaprasad) కు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై, క్రైస్తవంపై విశేషమైన పట్టు ఉంది. శ్రీపదార్చన, ఆవాహన,  పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ,  శ్రావణి,  వంశధార, తంజావూరు విజయం, మహాసర్గ, బసవగీత, సమ్రాట్ పుష్యమిత్ర, సగం విరిగిన చంద్రుడు వీరి ప్రసిద్ధమైన నవలలు. వీరు ఆర్ఎస్ఎస్ లో కూడా పనిచేశారు. అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. వీరి మృతి పట్ల భాషా సాహితి వేత్తలు, నవలా రచయితలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>