సంజూ ఫామ్‌పై విహారీ సంచలన వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్: సంజూ శాంసన్‌కు ఇంకెన్ని అవకాశాలు ఇస్తారంటూ టీమిండియా మాజీ ఆటగాడు హనుమ విహారీ (Hanuma Vihari) ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెస్టిండీస్‌తో తొలి టీ20లో శాంసన్ 11 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అతడి ఫామ్‌పై హనుమ విహారి స్పందిస్తూ.. శాంసన్‌కు ఇస్తున్న ‘లాంగ్ రోప్’ ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారిందని విహారి పేర్కొన్నాడు. శాంసన్‌కు తాను అభిమానినేనని, అతడు జట్టులో ఆడాలని కోరుకుంటున్నానని విహారి తెలిపాడు. అయితే పోటీ పెరగడం అతడిపై ఒత్తిడి పెంచుతోందని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగి వచ్చిన సమయంలోనూ శాంసన్‌పై ఆ ఒత్తిడి కనిపించిందని గుర్తుచేశాడు.

వైభవ్ పోటీలో ఉండటంతో..

ఇప్పుడు వైభవ్ కూడా పోటీలో ఉండటంతో ఆ ప్రభావం ఉండొచ్చని హనుమ విహారీ చెప్పాడు. భారత్, వెస్టిండీస్ తొలి టీ20లో శాంసన్ మరోసారి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. పవర్‌ప్లేలోనే 11 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆసియా క్రీడల్లోనూ అతడి స్కోర్లు 9, 7, 2గా ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌పై రెండు అర్ధ సెంచరీలు మినహా టీ20ల్లో అతడి ఫామ్ అంతగా బాగోలేదని గణాంకాలు చెబుతున్నాయి. రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో శాంసన్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>