లోకల్‌ వెల్మల్‌లో మొక్కజొన్న బస్తాల మాయం

కలం, సోన్‌: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సోన్‌ మండలం లోకల్‌ వెల్మల్‌ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయన్న, హరీష్‌, పోశెట్టి అనే రైతులు తమ పంట చేనుల్లో పండించిన మొక్కజొన్నను కోసి ఆరబెట్టి సంచుల్లో నింపి గ్రామంలో ఉంచారు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో పికప్‌ వాహనం, ద్విచక్ర వాహనంపై గ్రామానికి వచ్చి రైతులకు చెందిన 76 మొక్కజొన్న బస్తాలను ఎత్తుకెళ్లినట్లు (Corn Bags Theft) బాధిత రైతులు తెలిపారు.

దుండగులు నిర్మల్‌ రూరల్‌ మండలం చిట్యాల్ గ్రామం వైపు నుంచి వచ్చి సిద్ధాపూర్‌ మీదుగా భైంసా వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన రైతులు సోన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>