విమానంపై పిడుగు.. స్పందించిన ఇండిగో

క‌లం, వెబ్‌డెస్క్‌: ఆకాశంలో ప్ర‌యాణిస్తున్న‌ ఓ ఇండిగో విమానం (IndiGo Flight)పై పిడుగు ప‌డినట్లు వచ్చిన వార్తలు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం అక్టోబర్ 7న లక్నోలో ల్యాండ్ అయ్యే సమయంలో తీవ్రమైన ప్రతికూల వాతావరణం, వడగళ్ల వానలో చిక్కుకుంది. దాదాపు 17,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగింది. మొదట దీనిని పిడుగుపాటుగా భావించారు. అయితే విమానం ముక్కు భాగంలో ఉండే రేడోమ్ దెబ్బతిన్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. ఆ సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 110 మంది ఉన్నారు.

ప్రయాణం మధ్యలోనే ఈ భయానక పరిస్థితి ఎదురైనప్పటికీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్​పోర్ట్​లో షెడ్యూల్ కంటే దాదాపు ఎనిమిది నిమిషాలు ముందే ల్యాండ్ చేశారు. అత్యవసర ల్యాండింగ్ అని కొన్ని ప్రాథమిక నివేదికలు చెప్పినప్పటికీ, అధికారులు ఇది సాధారణ ల్యాండింగ్ అని స్పష్టం చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>