కలం, నిర్మల్ రూరల్: పోక్సో కేసులో (Nirmal POCSO Case) నిందితుడికి నిర్మల్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధించిందని రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 2024లో నమోదైన ఫోక్సో కేసులో ఎల్లపల్లి గ్రామానికి చెందిన బొడసు అరుణ్ అలియాస్ అరు నిందితుడిగా ఉన్నాడు. విచారించిన ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎస్. శ్రీవాణి నిందితుడిని దోషిగా నిర్ధారించి ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై లింబాద్రి హెచ్చరించారు.

