వెట్టిచాకిరీ ఘటనలకు చెక్ పెట్టాల్సిందే.. ఆదిలాబాద్ కలెక్టర్ పిలుపు

కలం, ఆదిలాబాద్: జిల్లాలో వెట్టిచాకిరీ నిర్మూలన లక్ష్యంగా అధికారులు, నేతలు సంయుక్తంగా పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ (Adilabad Collector) రాజర్షిషా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం ఆవరణలో ‘స్వేచ్ఛా రథాన్ని’ జిల్లా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఈ. ముత్యం రెడ్డి వెట్టిచాకిరి నుంచి విముక్తి అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బాండెడ్ లేబర్ అబాలిషన్ చట్టం పాతదైనప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో వెట్టిచాకిరీ ఘటనలు వెలుగుచూస్తున్నాయన్నారు.

ప్రత్యేకించి ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ తరహాలోనే బాండెడ్ చైల్డ్/సైడ్ లేబర్ విముక్తి కోసం ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఇటుక బట్టీలు, స్లమ్స్, మర్జ్ ఏరియాలు, బోథ్, ఉట్నూరు వంటి పెద్ద టౌన్‌లలోని కూలీల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఘటనలను తెలియజేయడానికి టోల్‌ఫ్రీ బాండెడ్ లేబర్ హెల్ప్‌లైన్ – 080-69434343 అందుబాటులో ఉందని తెలిపారు.

రెస్క్యూతోపాటు బాధితుల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని, రెస్క్యూ చేసిన ప్రాంతాల్లో ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. క్రిమినల్ సెలెక్షన్, పారా లీగల్ వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ దోపిడీకి గురికాకుండా స్వేచ్ఛగా పనిచేసేలా కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>