కరీంనగర్‌లో బతుకమ్మ ఏర్పాట్లపై మేయర్ సమీక్ష

కలం, కరీంనగర్ బ్యూరో: ​తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దసరా ఉత్సవాలను గొప్పగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) తెలిపారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ అధ్యక్షతన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిగింది.

రూ.2.80 కోట్లతో పనులు..

మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ నెల 10 నుంచి 20 వరకు వైభవంగా జరగనున్న బతుకమ్మ, దసరా, దేవీ నవరాత్రుల ఉత్సవాలకు రూ.2.80 కోట్లతో ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమైనట్లు తెలిపారు. 66 డివిజన్లలో బతుకమ్మ నిమజ్జన పాయింట్లు, అంబేడ్కర్ స్టేడియం దసరా ఉత్సవాలకు చేయాల్సిన సివిల్, ఎలక్ట్రికల్ పనులు, పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. టెండర్ల ప్రక్రియ, ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

నగర వ్యాప్తంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, మహిళలకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు సౌకర్యాలతో ఏర్పాటు చేయాలన్నారు. టెండర్ పనులు వచ్చిన కాంట్రాక్టర్లతో మూడు రోజుల ముందస్తుగానే పనులు పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఏర్పాట్లు, కల్చరల్ కార్యక్రమాలు లైటింగ్, స్టేజ్ నిర్మాణం, రావణ దహన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక కార్పొరేటర్ల సలహా, సూచనలు స్వీకరించాలన్నారు.

పండగ వాతావరణం ఉట్టి పడేలా..

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… బతుకమ్మ, దసరా పండగ వాతావరణం ఉట్టి పడేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండగ జరుపుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ.. ఎక్కడ లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ… సివిల్, లైటింగ్ ఏర్పాట్లను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాల మాదిరిగానే బతుకమ్మ దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఇన్‌ఛార్జి ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>