జాతీయ అవార్డు అందుకున్న డాక్టర్ రాహాతుల్లా

కలం, మహబూబ్​నగర్​ బ్యూరో: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్​నగర్​కు చెందిన డాక్టర్ రాహాతుల్లా (Doctor Rahatullah) కు సూపర్ సీనియర్ జనరల్ ఫిజీషియన్​ జాతీయ అవార్డు అందజేశారు. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మెమోరియల్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. హైదరాబాద్​లోని నాంపల్లిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ డాక్టర్ చంద్రముఖి స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అంజన మూర్తి చేతుల మీదుగా రాహాతుల్లా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజేశ్వరరావు, గర్రె శంకర్​ రావు, మ్యాజిక్ రాజా డాక్టర్ భాగ్యవతి, ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>