ఉరి శిక్షలు లేకపోవడంతో భారీగా నేరాలు: జస్టిస్ దీపాంకర్

కలం, వెబ్ డెస్క్: దేశంలో ఉరి శిక్షల అమలు లేకపోవడం కూడా నేరాల సంఖ్య భారీగా పెరగడానికి కారణమవుతోందని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా (Justice Dipankar Datta) అన్నారు. హత్య కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “చాలా సందర్భాల్లో మరణ శిక్షను సుప్రీం కోర్టు జీవిత ఖైదుగా మార్చాల్సి వస్తోంది. నేరాలు చేసేవారికి ఇది అలుసుగా మారింది. ఒకప్పుడు హత్య అనేది అత్యంత అరుదైనదిగా భావించేవారు. ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. అందుకే హత్య కేసుల్లో ఉరి శిక్ష పడితే చివరికి జీవిత ఖైదుగా తగ్గించాల్సి వస్తోంది” అన్నారు. ఏదో ఒక రోజు సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో స్పష్టమైన గీత గీసుకోవాల్సిందేనని.. కఠినంగా ఉంటేనే నేరాలు తగ్గే అవకాశం ఉందన్నారు.

ఇంట్రెస్టింగ్ కేసు చెప్పిన జడ్జి..

ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా (Justice Dipankar Datta) గతంలో జరిగిన ఒక ఆసక్తికరమైన కేసును గుర్తు చేసుకున్నారు. “కుమార్తెను ఒక తండ్రి రేప్ చేసి హత్య చేశాడు. భార్య ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. తరువాత కాలంలో శిక్ష తగ్గడంతో పెరోల్ మీద బయటకు వచ్చి.. సాక్ష్యం చెప్పిన భార్యను చంపేశాడు. ఇప్పుడు అతడి చిన్న కుమార్తె ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కోర్టు మళ్లీ జీవిత ఖైదు విధించింది. కానీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడంతో అతడి కుమార్తెను మర్డర్ చేయలేదు కదా.. అనే కారణంతో శిక్షను మళ్లీ తగ్గించారు. సుప్రీం కోర్టు ఇలాంటి క్షమాభిక్ష గుణాన్ని వదిలిపెడితేనే.. దేశం ఎదుర్కొంటున్న నేరాల నుంచి బయటపడే అవకాశం ఉంది. దీనికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాలి” అని స్పష్టం చేశారు.

Also Read : మోదీ ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు.. అభిజీత్ దీప్కే ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>