పంచాయతీరాజ్ రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ, వీవో భవనాల నిర్మాణాల పురోగతిపై ఆయా మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ మండలాల్లో కొనసాగుతున్న పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణ పనులను (Panchayat Raj Road Works) త్వరితగతిన పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

రోడ్ల నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను గుర్తించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల నిర్మాణ పనులకు నిధుల అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, వీవో భవనాల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎంపీడీవోలు వై. శశికళ (ఇల్లంతకుంట), పి. అనిత (శంకరపట్నం), డి. శ్రీనివాస్ (తిమ్మాపూర్), వి. సురేందర్ (గన్నేరువరం), పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ ఎం.ఏ. రహమాన్, కార్యనిర్వాహక ఇంజినీర్లు జనార్దన్, వై. సుదర్శన్ రెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు ఎస్. వెంకటరమణ, కె. రవి ప్రసాద్, ఎస్. మంజులాభార్గవి, ఏఈలు ఎ. రాజేష్, ఎం. ప్రవీణ్, ఏ. స్నేహజ్యోతి, కె. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>