కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రేట్ల (GST Rates)లో ఎలాంటి మార్పులు చేయొద్దని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రాసిక్యూషన్ పరిమమితిని రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అదే సమయంలో జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను తొలగించారు. ఇక నుంచి అన్ని ప్లాట్ ఫాంలకు ఒకే పన్ను విధానం అమలు చేయబోతున్నారు. రీఫండ్ ప్రాసెస్ 10 రోజులుగా నిర్ధారించిన కౌన్సిల్.. ఎలాంటి రీఫండ్ అయినా 90 శాతం ఆటోమెటిక్గానే జరిగిపోవాలని భావిస్తోంది. అదే సమయంలో ఇక నుంచి ఏడాదికి ఒకసారి మాత్రమే రిటర్న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. వ్యాపారులకు జరిమానాను రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది.
Also Read : ప్రపంచ టెక్నాలజీకి భారత్ వేదిక కావాలి : ప్రధాని మోదీ
Follow Us On: X(Twitter)

