మీడియా రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం: శ్రీనివాస్ రెడ్డి

కలం, ఆదిలాబాద్: సమాజంలో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర మీడియా అకాడమీ (Media Academy) చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ హాల్‌లో విలేకరులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మెన్ (Media Academy Chairman Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వార్తల సేకరణ, వాస్తవ నిర్ధారణ, విశ్లేషణ, రచన, ప్రసారం వంటి ప్రతి దశలో జర్నలిస్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం క్షణాల్లో విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు.

వార్తను వేగంగా అందించడం కంటే, వాస్తవాలను నిర్ధారించి బాధ్యతాయుతంగా ప్రజలకు అందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలకు తావులేకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడమే పాత్రికేయుల ప్రధాన బాధ్యతగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వరరావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, డీపీఆర్వో విష్ణు వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>