ఈసీ అధికార పార్టీకే అనుకూలం: ప్ర‌శాంత్ కిషోర్

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఈ వ్య‌వ‌హారంపై జ‌న సూరాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్​లోని ధర్భంగాలో ఆయన మాట్లాడుతూ.. జ్ఞానేష్ కుమార్ కంటే ముందు రాజీవ్ కుమార్ కూడా అదే రీతిలో ఎన్నికల సంఘాన్ని నడిపారని విమర్శించారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌గా నియమితులయ్యారని చెప్పారు.

ఒక్క వ్యక్తి వల్లనో, ఏ ఒక్క ఘటన వల్లనో కాకుండా గత ఏడేళ్లుగా ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల షెడ్యూల్, కోడ్ ఉల్లంఘనల అమలు, బీహార్‌లో ప్రభుత్వాలు రూ.10,000 పంపిణీ చేయడం వంటి అంశాల్లో ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) డిమాండ్ చేశారు. కేవలం రాజీనామాతో సరిపోదని, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితా తయారీలో సమూల మార్పులు రావాలని ఆయన సూచించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఫామ్​ 17ను ప్రజల ముందుకు తీసుకురావాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఓట్ల లెక్కింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు.

Also Read : సాహిత్యంలో అన్నె కార్సెన్‌కు నోబెల్ పురస్కారం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>