కలం, నిర్మల్: టీబీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో (TB Mukt Bharat) భాగంగా గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్‌మాట్లాడుతూ.. టీబీ లక్షణాలను తొలిదశలో గుర్తించి పరీక్షలు చేయించుకోవడంతో చికిత్సను నిర్మూలించవచ్చని అన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
టీబీ నయం చేయగల వ్యాధి అని, వైద్యుల సూచన మేరకు చికిత్స పూర్తిచేయాలని తెలిపారు. 2025లో టీబీ కేసులు నమోదు కాని తల్వేద, రాసిమెట్ల, కొండకూరు, ఇటిక్యాల, సంఘంపేట్, చందారం గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఎంపీడీవోలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

