పంటలు ఎండిపోతున్నాయి.. కాంగ్రెస్‌పై దినేష్ పటేల్ ఆగ్రహం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని మిట్టపల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను ఇందూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel) పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇతర ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారని, రైతుల పంటలను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకునేందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని దినేష్ పటేల్ (Dinesh Patel) విమర్శించారు. రూరల్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందిస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్, సాగునీటి సౌకర్యాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రకాంత్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గంగారెడ్డి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు జిల్లా వెల్మ గంగారెడ్డి, ఓంసింగ్, దేశపతి శీను, గణేష్, ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, నవీన్, కమలాపూర్ సర్పంచ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

Also Read : జ్ఞానేష్ కుమార్‌కు మాజీ జడ్జిల మద్దతు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>