చుట్ట‌మ‌ల్లె మార్ఫింగ్ నిందితుడి అరెస్ట్.. స‌జ్జ‌నార్ క్లారిటీ

క‌లం, వెబ్‌డెస్క్‌: సోష‌ల్ మీడియాలో ఏఐ దుర్వినియోగం తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ (CP Sajjanar) ఫోటోను సైతం కొంద‌రు మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసేశారు. ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమాలోని చుట్ట‌మ‌ల్లే పాట‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఏఐతో అశ్లీలంగా మార్చిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. స్వ‌యంగా ఎన్టీఆర్ దీనికి బాధ్యులైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. టాలీవుడ్ స‌హా ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోని ప్ర‌ముఖులు దీనిపై స్పందించారు. ఈ వీడియోను షేర్ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఎక్స్ వేదిక‌గా గ‌ళ‌మెత్తారు. దీంతో ఈ ఏఐ వీడియో వెనుక ఉన్న వారిని త్వ‌ర‌లో అరెస్ట్ చేస్తార‌ని అంతా భావించారు.

ఇదే స‌మ‌యంలో సీపీ స‌జ్జ‌నార్ ఈ వీడియోకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఒక వ్య‌క్తిని స‌జ్జ‌నార్ అరెస్ట్ చేసిన‌ట్లు చూపిస్తున్న ఫోటోతో ఇది వైర‌ల్‌గా మారింది. ఇది నిజ‌మేన‌ని భావించిన వారంతా దీన్ని తెగ షేర్ చేశారు. అయితే ఇది ఒక ఫేక్​ ఫోటో. ఈ వైర‌ల్ పోస్ట్ పై స‌జ్జ‌నార్ స్పందించారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ మార్ఫింగ్ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారాలను, డీప్‌ఫేక్ కంటెంట్‌ను ప్రజలు ఎవరూ షేర్ చేయవద్దని, ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఏఐ టెక్నాలజీని వాడుతున్న వారి ఆట కట్టిస్తామని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు, నెటిజన్లకు పిలుపునిచ్చారు. త‌న ఫోటో వాడి ఏఐని దుర్వినియోగం చేస్తున్న త‌న అభిమానుల‌పై ఎన్టీఆర్ దృష్టి పెట్టాల‌ని సూచించారు. ఆ పోస్టు నిజ‌మేన‌ని భావించి షేర్ చేసిన‌ కొన్ని మీడియా సంస్థ‌లు స‌జ్జ‌నార్‌కు క్ష‌మాప‌ణ‌ చెప్తూ త‌మ పోస్టును తొల‌గించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>