ఢిల్లీలో ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

కలం, వెబ్ డెస్స్ : ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar), ఆయన కుటుంబ సభ్యుల ఇంటి వద్ద ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఈసీ భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించి భద్రతను పెంచారు. జ్ఞానేశ్ కుమార్ కు ఇప్పటికే ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు అదనపు సిబ్బందిని మోహరించారు. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ప్రధాన కార్యలయం దగ్గర సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) కు వ్యతిరేకంగా ఇండి కూటమి ఎంపీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. సీఈసీ నివాసం ముట్టడికి విపక్షాలు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఈసీ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టం చేశారు. భారీ ఎత్తున ఆందోళన చేపట్టేందుకు కూటమి ఎంపీలు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం సీఈసీ భద్రత పెంచింది.

Also Read : తిరుమలలో దారి అడిగే పని ఇక లేదు.. భక్తుల కోసం TTD కొత్త యాప్ ఇదే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>