ప్రయాణికులకు అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు!

కలం, వెబ్ డెస్క్ : రాబోయే దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల కోసం రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్ల (Special Trains)ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 ఉమ్మడి తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నారు.

మరోవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు విశాఖపట్నం – బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 25 వరకు, నర్సాపూర్ – తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు రేపు సికింద్రాబాద్ – కాకినాడ మార్గంలోనూ ప్రత్యేక రైలు (Special Trains) సర్వీసు అందుబాటులో ఉండనుంది. పండుగల సమయాల్లో స్వస్థలాలకు వెళ్లేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Also Read : తిరుమలలో దారి అడిగే పని ఇక లేదు.. భక్తుల కోసం TTD కొత్త యాప్ ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>