కలం, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ పట్టణ పోలీసులు (Nirmal Police) ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని కిసాన్, చెన్నై, మాంగల్య, చందన బ్రదర్స్, ఆనంద్ షాపింగ్ మాల్ తదితర వాణిజ్య సముదాయాలకు బుధవారం నోటీసులు అందజేశారు.
మాల్స్‌కు వచ్చే, వెళ్లే వాహనాల కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు మాల్ యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని, పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

