గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పుష్కర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కుంభమేళా తరహాలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నందున ఘాట్ల పనుల్లో ఆలస్యం వహించవద్దని స్పష్టం చేశారు.

​వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే ఈ పుష్కరాల (Godavari Pushkaralu) పనుల పర్యవేక్షణకు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్‌ను నోడల్ అధికారిగా నియమించారు. భద్రాచలం, పర్ణశాల, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో ఘాట్ల మరమ్మతులు, అప్రోచ్ రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులను ముందస్తుగా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. 2015 పుష్కరాల వివరాలతో 30 పేజీల ప్రత్యేక బుక్‌లెట్ రూపొందించాలని, చెత్త తరలింపునకు 30 ఎకరాల డంపింగ్ యార్డ్‌ను వినియోగించుకోవాలని ఆదేశించారు.

​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాల్వంచ–దమ్మపేట, తల్లాడ–భద్రాచలం తదితర ప్రధాన రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ ఏరియాలను పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని ఖరారు చేయాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చివరి నిమిషంలో ఒత్తిడి లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>